ఆ సమయంలో చరణ్ ను చూసి కంటతడి పెట్టుకున్న సురేఖ..?

murali krishna
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగాస్టార్  చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తన అద్భుతమైన నటన తో చరణ్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటన తో పాటు డాన్స్ పరంగా కూడా తండ్రికి మించిన తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరో గా  పరిచయం కాగా తొలి సినిమాతోనే చరణ్ మంచి విజయం అందుకున్నారు.ఈ సినిమాలో నేహా శర్మ హీరోయిన్ గా నటించగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.అయితే చిరుత మూవీ షూట్ బ్యాంకాక్ లో జరిగిందనే సంగతి తెలిసిందే.

 ఇదిలా వుండగా చరణ్ పుట్టినరోజున సురేఖ, చిరంజీవి బ్యాంకాక్ కు కొడుకును చూడటానికి వెళ్లగా ఆ సమయంలో బ్యాంకాక్ లో చరణ్ ఫేస్ బాగా ట్యాన్ అయ్యి కనిపించాడు.చరణ్ ను అలా చూసిన వెంటనే సురేఖ ఎమోషనల్ అయ్యి కంట తడి పెట్టుకున్నారు.అయితే తన కొడుకు కష్టపడటం చూసి చిరంజీవి ఎంతో సంతోషించారట.చిరుత సినిమా రాంచరణ్ కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ సినిమా తర్వాత చరణ్ రాజమౌళి దర్శకత్వం లో మగధీర సినిమా లో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.ఆ సినిమాతో చరణ్ స్టార్ హీరో గా మారారు.ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ వరుస బ్లాక్ బస్టర్స్ తన ఖాతా లో వేసుకుంటున్నారు.చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ వైడ్ గా భారీ విజయం సాధించింది.ఈ సినిమా తో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు ప్రస్తుతం రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో "గేమ్ ఛేంజర్" సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: