హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. ఈ సినిమా తాజాగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమా తమిళ నటుడు, డైరెక్టర్ ఎస్.జే సూర్య నెగిటివ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.వెర్సటైల్ యాక్టర్ ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం టీమ్ ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఒకప్పుడు డైరెక్టర్‌గా ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఎస్ జే సూర్య ఇప్పుడు యాక్టర్‌గా బిజీ అయిపోయారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో అటు విలన్ సహా కమెడియన్ రోల్స్‌లో మెప్పించారు. ఇక తాజాగా సరిపోదా శనివారం సినిమాలో కూడా విలన్ రోల్‌కి ఎస్ జే సూర్య ఓకే చెప్పారు.పోలీస్ ఆఫీసర్‌కు, కామన్ మ్యాన్‌కు మధ్య పోరాటం నేపథ్యంలో యాక్షన్ అంశాలతో ఈ వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. భాగవతం కథతో నాని వాయిస్ ఓవర్ ద్వారా ఎస్జే సూర్య పాత్రను పరిచయం చేయడం కొత్తగా ఉంది. ఈ వీడియోలో తెలుగులో కాకుండా హిందీలో డైలాగ్స్ వినిపిస్తోన్నాయి.అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ప్రజల్ని బాగా హింసించేవాడు" అంటూ పోలీస్ పాత్రలో ఉన్న ఎస్ జే సూర్యను ఉద్దేశిస్తూ సన్నివేశాల్ని చూపించారు. "అందుకే శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసుడిని వధించారు" అంటూ నాని చెప్పే డైలాగ్‌తో యాక్షన్ విజువల్ ట్రీట్ ఇచ్చారు.
ఫైనల్‌గా నాని 'హ్యాపీ బర్త్‌డే సార్' అని చెప్పగా ఎస్ సూర్య నవ్వూతూ కిందకి పడిపోవడం చూపించారు. అంటే సూర్య సినిమాలో ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్. తన అరాచకాల్ని హీరో(నాని) హీరోయిన్‌తో కలిసి ఎలా ఎదిరించాడన్నది సినిమా కాన్సెప్ట్. సూర్య- నాని మధ్య సాగే పోరు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. మొత్తంగా ప్రస్తుత టీజర్ చూస్తుంటే యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్టు అర్థం అవుతోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎనర్జిటిక్‌గా సాగింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత డివివి దానయ్య ఇప్పటికే అనౌన్స్ చేశారు.కాగా నాని-వికేక్ ఆత్రేయ కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న సరిపోదా శనివారం మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ ఆరుళ్ హీరోయిన్గా నటించారు.