అక్కినేని నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా తండేల్ కార్తికేయ టు తో భారీ సక్సెస్ అందుకున్న చందు ముండేటి చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. నేడు జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీ వాస్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చైతూ తండేల్ చిత్రాన్ని 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇది నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కాగా, ఇప్పటికే డిజిటల్ రైట్స్ నుంచి మేకర్స్ 40
కోట్లు రికవరీ చేశారు. సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే, భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం చైతూ ఈ చిత్రం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రేమ మరియు దేశభక్తి అంశాల సమ్మేళనం గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే తండేల్ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
దీనిక్కారణం డిసెంబర్ క్యూలైన్‌లో భారీ చిత్రాలుండటమేనన్న టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప ది రూల్, రాంచరణ్ గేమ్ ఛేంజర్, మంచు విష్ణు కన్నప్ప సినిమాలతోపాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా డిసెంబర్‌లోనే రాబోతున్నాయి. ఇలా వరుస సినిమాలు లైన్‌లో ఉన్న నేపథ్యంలో తండేల్‌ను 2025 జనవరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెగ చర్చ నడుస్తోంది. మరి ఈ విషయంపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి...!!