షాక్:ఆ హీరో కోసం జైలుకి వేళ్లిన డైరెక్టర్.. ఎందుకంటే..?
గతంలో దర్శన్, తరుణ్ సుధీర్ కాంబినేషన్లో బాగానే సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి .అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉన్నదట. ఆగస్టులో తరుణ్ పెళ్లి ఉండడంతో దర్శన్ పెళ్లికి పిలవడానికి జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది.. జైల్లో దర్శన్ ను కలిసిన తరుణ్ తన పెళ్లి పత్రికను ఇచ్చి మరి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. త్వరలోనే హీరో దర్శన్ నిరపరాధిగా బయటికి వస్తాడు అంటూ కూడా తెలియజేశారు.. జైల్లో దర్శన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది సుధీర్..
దర్శన్ గురించి మాట్లాడుతూ దర్శన్ ఎప్పటిలాగానే నవ్వుతూ పలకరించారు అయితే ఆయనను చూస్తూ ఉంటే ఆరోగ్యం బాగాలేదు అనిపిస్తోంది. ఆయన అరెస్టు తర్వాత మేమంతా ఏదో కోల్పోయాం అనిపిస్తోంది. దర్శన్ ఎలాంటి తప్పు చేయలేదని తనకు తెలుసు తన పెళ్లి కుదిరిన సంగతి గతంలో దర్శన్ కి కూడా తెలియజేశాను తన పెళ్లికి ఆహ్వానించడానికి జైలు వరకు వెళ్లానని తెలిపారు.. తనకోసం పెళ్లి వాయిదా వేసుకోవాలనుకున్నప్పుడు తిట్టారని కూడా తెలిపారు సుధీర్.. ఆయన త్వరలోనే నిరపదాదిగా బయటికి వస్తారని తన పెళ్లికి హాజరవుతారని కూడా తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ న్యూస్ అయితే కన్నడ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.