కల్కి టీంకి షాక్.. ప్రభాస్ కు నోటీసులు..!

Divya
పాన్ ఇండియా హీరో ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి సినిమా ఏ విధంగా హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మైథాలజీ అండ్ ఫిక్షనల్ స్టోరీస్ లో భాగంగా రావడంతో మంచి విజయాన్ని అందుకుంది. హీరోయిన్గా దిశ పటానీ ,దీపికా పదుకొనే నటించారు. కీలకమైన పాత్రలో అమితాబచ్చన్, కమలహాసన్ వంటి వారు కూడా నటించారు. అలాగే విజయ్ దేవరకొండ ,దుల్కర్ సల్మాన్, శోభన , మృణాల్ ఠాగూర్ తదితర నటీ నటులు నటించారు. వై జయంతి మూవీస్ బ్యానర్ పైన 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది కాగా ఈ సినిమాకు ప్రధాన బలం ఏమిటంటే మహాభారతం సినిమా కథను జోడించడమే.. ఇందులో చాలా సీన్స్ కోసమే కల్కి సినిమాకి ప్రేక్షకులు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై కల్కి చిత్ర బృందానికి ఒక షాక్ తగిలింది.. అదేమిటంటే కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు ఇచ్చారట. ఈ సినిమా హిందువుల మనోభావాలను సైతం దెబ్బతీసేలా ఉందంటూ ఆచార్య ప్రమోద్ కృష్ణ చిత్ర బృందంతో పాటు ఇందులో నటించిన ప్రభాస్ అమితాబచ్చన్ కు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కల్కి పుట్టుకని చాలా తప్పుగా చూపించారని ఆయన అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడాన్ని తప్పు పట్టడం జరిగింది. మన పురాణాలలో ఉన్నటువంటి కల్కి సినిమాకి ఇది చాలా విరుద్ధంగా ఉన్నదని ఈ సినిమా మతపరమైన మనోభావాలను సైతం కించపరిచేలా ఉన్నదంటూ తెలియజేశారు.. మేము ఇందులో అభ్యంతరాలను మాత్రమే చెప్పాము చిత్ర బృందం స్పందన కోసం మేము వెయిట్ చేస్తున్నామంటూ తెలిపారు..కల్కి భగవానుడు కాన్సెప్ట్ ని ఈ సినిమా మార్చేసింది అంటూ ఇది పురాణాలను , సాహిత్యాలను అగౌరపరచడానికి వల్ల ఇతిహాసాల పైన జనాలలో చాలా గందరగోళం ఏర్పడుతుంది అంటూ ఆచార్య ప్రమోద్ కృష్ణ తెలిపారు. మరి టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: