బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ గత కొన్నాళ్ల నుంచి తన సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.ఇక తన మాజీ భార్య సుస్సానే ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్ బాలీవుడ్ సింగర్ కమ్ హీరోయిన్ అయిన సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరు కలిసి బాలీవుడ్ ఈవెంట్స్, పలు పార్టీలలో కలిసి పాల్గొన్నారు. మరోవైపు మాజీ భార్య సుస్సానే ఖాన్ కూడా జీవితంలో ముందుకు సాగింది. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ జంటకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. కానీ గతంలో వీరిద్దరు విడాకులు ప్రకటించడంతో హృతిక్ రోషన్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. హృతిక్ రోషన్ బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. ఆయన మల్టీ మిలియనీర్. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ తమ విడాకుల గురించి ఎప్పుడూ పెద్దగా కూడా మాట్లాడలేదు. హృతిక్ రోషన్, సుస్సానే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయితే విడాకుల తర్వాత కూడా వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతున్నారు.అయితే హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులు అని అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారం నడిచింది.
విడాకుల తర్వాత తన మాజీ భార్య సుస్సానే ఖాన్ కు హృతిక్ ఏకంగా రూ.400 కోట్లు చెల్లించినట్లు వినిపించాయి. దీంతో ఆ సమయంలో సుస్సానే ఖాన్‌పై ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. సుస్సానే ఖాన్ హృతిక్ రోషన్ నుండి భరణంగా ఏకంగా 400 కోట్లు డిమాండ్ చేసిందని.. దీంతో ఆ మొత్తాన్ని హృతిక్ రోషన్ సుస్సానేకి ఇచ్చాడని కొన్ని నివేదికలు వెల్లడించారు. ఇంత భారీ భరణం అందుకున్నందుకు సుస్సానే పై బాలీవుడ్ ఫ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తనపై వచ్చిన నెగిటివిటీ పై సుస్సానే ఏమాత్రం స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని హృతిక్ రోషన్ వెల్లడించడం జరిగింది.400 కోట్ల భరణం తర్వాత హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. ఇందులో మాజీ భార్య సుస్సానేకి భరణంగా 400 కోట్లు చెల్లించారనే టాక్ తప్పని హృతిక్ రోషన్ క్లియర్ గా వెల్లడించాడు. ఈ విషయాలు తప్పని కారణం లేకుండా ఇది ఒక రకమైన వేధింపు అని హృతిక్ రోషన్ చెప్పాడు. సుస్సానే ఖాన్ తన నుండి భరణంగా ఎటువంటి డబ్బు తీసుకోలేదని వెల్లడించాడు. అయితే, బాలీవుడ్లో సుస్సానే ఖాన్, హృతిక్ రోషన్ల విడాకులు అత్యంత ఖరీదైనవి అనే టాక్ ఇప్పటికీ కూడా ఉంది.