బిగ్బాస్: బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారట.. మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్..??
అయితే తన లేటెస్ట్ యూట్యూబ్ వీడియోలో బిగ్బాస్ హౌస్లో చాలా సీక్రెట్ మైక్స్, సీక్రెట్ కెమెరాలు ఉంటాయని చెప్పాడు. దాంతో అందరూ నిర్ఘాంత పోయారు. ఆదిరెడ్డి చెప్పినట్లు ప్రతి సీజన్ స్టార్టింగ్కు 30 రోజుల ముందే బిగ్బాస్ హౌస్ బిల్డ్ చేస్తారు. అంతా పూర్తయ్యాక ఏవైనా లోపాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. ఉంటే వాటిని ఫిక్స్ చేస్తారు. ఇదే క్రమంలో బిగ్బాస్ హౌస్లో ప్రతి చోటా కూడా సీక్రెట్ మైక్రోలు, కెమెరాలు ఇన్స్టాల్ చేస్తారని ఆదిరెడ్డి అన్నాడు. చివరికి బాత్ రూమ్ లో కూడా సీక్రెట్ మైక్స్ పెడతారని ఆయన చెప్పాడు. సాధారణంగా బాత్రూమ్స్ వాడుకునే ముందు కంటెస్టెంట్స్ మైక్ తొలగించి, దాన్ని బయటపెడతారు. అయితే వాష్ రూమ్ లో ఉన్నప్పుడు చేసే సౌండ్స్ ఎవరికీ వినిపించవని వీళ్లు అనుకుంటారు. కానీ అలా అనుకోవటమే పొరపాటేనట. ఎందుకంటే సీక్రెట్ మైక్స్ బాత్రూమ్లోనూ ఉంటాయట. వాటి ద్వారా నిర్వాహకులు మాటలు వింటారని ఆదిరెడ్డి చెప్తున్నాడు.
మైకులు బ్యాటరీలతో వర్క్ అవుతాయి. చార్జింగ్ అయిపోతే స్టోర్ రూమ్ లోకి వెళ్లి బ్యాటరీలు మార్చవచ్చు. బ్యాటరీస్ తీసేసాక తమ మాట ఎవరికీ వినపడదు అనుకొని కొంతమంది కంటెస్టెంట్స్ ఏదో ఒక మాట జారేస్తుంటారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్లు బ్యాటరీస్ తీసేసిన సరే సీక్రెట్ మైక్స్ ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతాయట. ఇక మైకుల వలే కెమెరాలు కూడా ప్రతిచోట అమర్చుతారని ఆదిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ఆదిరెడ్డి చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో తెలియదు కానీ అందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ జాగ్రత్తగా ఉండటం ఎందుకైనా మంచిది అని పలువురు కామెంట్ చేస్తున్నారు.