బిగ్ బాస్ 8 మొదలయ్యే డేట్ ఇదేనా..?
బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మాలో సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. సీజన్ 8 లో ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఉంటారని టాక్. బిగ్ బాస్ సీజన్ 8లో వేణు స్వామి, కుమారి ఆంటీ, బర్రెలక్క వీరితో పాటు బంచిక్ బబ్లూకి ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సెలబ్రిటీ హోదాలో కొందరు హౌస్ లోకి వెళ్లబోతున్నారట. ఒక జంట కూడా వెళ్తుందని టాక్.
బిగ్ బాస్ సీజన్ 8 లోగో కొత్తగా ఉంది. ఎనిమిదిని ముందు అడ్డంగా చూపించి ఆ తర్వాత బిగ్ బాస్ మధ్యలో ఉంచారు. అంతేకాదు దానిలో ఏదో గుర్తు కూడా ఉంది. అంటే ఈ సీజన్ కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతుందని అర్ధమవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఐతే అతను గెలిచాక కొందరు అతని ఫాలోవర్స్ చేసిన హంగామా తెలిసిందే. అందుకే ఈసారి బిగ్ బాస్ ఫాలోవర్స్ ని ఎవరిని స్టూడియో దగ్గరకు వచ్చేలా పర్మిషన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ని సెప్టెంబర్ 8న గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ సీజన్ కూడా 105 రోజులు ఉంటుందని తెలుస్తుంది.