విజయ్ దేవరకొండ హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా డేట్.. అందుకే విడాకులు?
మరి ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలాంటి డేటింగ్ ట్రెండ్ కాస్త ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన నటించిన ఒక బ్యూటీ ఇక కొత్త వ్యక్తితో డేటింగ్ లో మునిగి తేలుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే ముగ్గురు హీరోలతో ప్రేమాయణం నడిపించిన ఈ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు అందరికీ బ్రేకప్ చెప్పేసి.. మరో వ్యక్తి ప్రేమలో పడిపోయింది. ఆ బ్యూటీ ఎవరు కాదు లైగర్ హీరోయిన్ అనన్య పాండే. చంకి పాండే కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య తన గ్లామర్ అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఇప్పటికే బాలీవుడ్ హీరోలైన షాహీద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కత్తర్, కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి హీరోలతో డేటింగ్ చేసింది. ఇక ఇప్పుడు ఆదిత్య రాయ్ కపూర్ తో బ్రేకప్ చెప్పేసి మరో వ్యక్తి ప్రేమలో పడిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు. ఇటీవల భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగానే ఉంటున్న టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. వీరిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వీరిద్దరూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఒకేలా ఉండడమే. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ క్రేజీ గాసిప్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది అని చెప్పాలి అయితే ఇటీవల హార్దిక్ పాండ్యా భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేయడం సంచలనంగా మారిపోయింది.