రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల పరంపరను కొనసాగిస్తూ వస్తుంది. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 25 వ రోజు అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీల లిస్టు లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీ విడుదల అయిన 25 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.45 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇన్ని రోజుల పాటు బాహుబలి 2 సినిమా విడుదల అయిన 25 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.39 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో ఉండగా , ఆ సినిమాను వెనక్కు నెట్టేసి కల్కి సినిమా ప్రస్తుతం మొదటి స్థానంలోకి వచ్చేసింది.
ఇక 25 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి సినిమా 80 లక్షల కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరో గా రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 అనే కన్నడ డబ్బింగ్ సినిమా విడుదల అయిన 25 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 78 లక్షల కలెక్షన్లను వసూలు చేసి 4 వ స్థానంలో కొనసాగుతుంది.
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా విడుదల అయిన 25 వ రోజు 65 లక్షల షేర్ కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ 47 లక్షల కలెక్షన్ లను వసూలు చేసి స్థానంలోనూ , ఆర్ ఆర్ ఆర్ మూవీ 36 లక్షల కలెక్షన్లతో 7 వ స్థానంలోనూ , హనుమాన్ సినిమా 35 లక్షల కలెక్షన్లతో 8 వ స్థానంలోనూ నిలిచాయి.