కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి కంగువ . సూర్య 42వ ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానిక శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య బర్త్ డే సందర్భంగా కంగువ ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఫస్ట్ సింగిల్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫైర్సాంగ్ను సూర్య బర్త్ డే కానుకగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాట 1000 మంది ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఉండబోతుందని కొరియోగ్రఫర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సూర్య బర్త్ డే సాంగ్ గూస్బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని తెలిసిపోతుంది.కాగా, నేడు సూర్య బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండి ఫైర్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సూర్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా, అందులోని ట్రైబల్ పాత్రకు సంబంధించిన పాటగా ఈ ఫైర్ సాంగ్ ఉండనుంది. ”ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల..” అంటూ సాగే ఈ సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ ను అందించాడు.
ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా అనురాగ్ కుల్కర్ణి, దీప్తి సురేశ్ లు ఈ పాటను పాడారు. ఈ సినిమాకు వెట్రి పళణిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కెఇ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.' ఫైర్...' పాటకు తెలుగులో శ్రీమణి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ ఆలపించారు. అరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, సాయి శరణ్, ప్రసన్న ఆదిశేష కోరస్ అందించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహించారు.ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో సూర్య ఓ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. దీన్ని చూసి ఫ్యాన్స్ ఈ పాత్ర రోలెక్స్ వైబ్స్‌లో ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.