బాలయ్య, బాబి సినిమాపై లేటెస్ట్ బజ్..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 109వ సినిమా బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది. ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు పయనమైంది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం

 అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యతో పాటు ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. పైగా బాలయ్యతో పాటు బాబీ డియోల్ లుక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట. అందుకే, సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఈ క్లైమాక్స్ సీక్వెన్సే హైలైట్

 గా ఉంటుందట. ఏది ఏమైనా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక విడుదల అనుకోగా ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు బాలయ్య. దీంతో షూట్ వాయిదా పడుతూ వచ్చింది. అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇటీవల బాలయ్య షూటింగ్ లో అడుగు పెట్టారు. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టు టాక్. అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ డేట్ కు వస్తే వారం గ్యాప్ లో అనగా 25న రానున్న శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ నుండి గట్టి పోటీ ఉంటుంది. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: