కోలీవుడ్ లేడీ పవర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అందులో భాగంగానే తాజాగా మరో కొత్త సినిమా చేయడానికి సిద్ధమయ్యింది నయనతార. అయితే తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించింది. అయితే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ తర్వాత మాత్రం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది. ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా నుంచి కూల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నాళ్లు స్టార్ హీరోస్ సరసన సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఉన్నట్లుండి యంగ్ హీరోతో
జతకట్టడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇంతకీ ఎవరంటే.. కోలీవుడ్ యంగ్ హీరో.. కవిన్. నయనతార, కెవిన్ జంటగా తమిళంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ద్వారా లోకేష్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవాన్ దర్శకుడిగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది. నయనతారతో పాటు కెవిన్ ఈ మూవీ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.ఈ పోస్టర్లో నయనతార, కెవిన్ ఒకరి కళ్లల్లోకి మరొకరు రొమాంటిక్‌గా
చూసుకుంటూ కనిపిస్తోన్నారు. ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. అయితే ఇందులో తనకంటే వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో ప్రేమలో పడ్డ మహిళ కథతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. వారి ప్రేమకథకు కుటుంబంతో పాటు సమాజం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది రొమాన్స్, కామెడీని మేళవించి ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నయన్, కెవిన్ కెమిస్ట్రీ కొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు. కథానుగుణంగా కొన్ని లిప్‌లాక్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నయన్.. ఇప్పుడు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. తెలుగు, హిందీ, తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఏమాత్రం తొందర పడకుండా నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది నయన్.