యశ్ టాక్సిక్ లో మరో అందాల భామ..!
బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న తారా సుతారియాని కూడా యశ్ టాక్సిక్ లో సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. తారా సుతారియా లాంటి ముద్దుగుమ్మ కూడా యశ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అయితే ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేష్ ప్రతినాయకిగా కనిపిస్తుంది. సినిమాలో విజువల్స్ అదిరిపోతాయని. పీరియాడికల్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో యశ్ మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటుతాడని అంటున్నారు.
అన్ని అనుకున్నట్టుగా కుదిరితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. లేడీ డైరెక్టర్ అయినా కూడా గీతు మోహన్ దాస్ టాక్సిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రెండు మేజర్ షెడ్యూళ్లను పూర్తి చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఈ సీమాలో నయనతార ఉంటుందని వార్తలు వచ్చినా ఆ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. యశ్ టాక్సిక్ మరో కె.జి.ఎఫ్ లాంటి సినిమా అవుతుందా లేదా దాన్ని మించే సినిమా అవుతుందా అన్నది చూడాలి.