మాస్ మహారాజా
రవితేజ హీరోగా భాగ్య
శ్రీ బోర్స్
హీరోయిన్ గా
హరీష్ శంకర్ దర్శకత్వంలో
మిస్టర్ బచ్చన్ అనే
మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ
విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించగా ... జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. మిక్కీ జే మేయర్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఈ
మూవీ ని ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ
మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ
మూవీ లో
టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈయన పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువగానే ఉన్నప్పటికీ
సినిమా కథను మొత్తం మలుపు తిప్పే పాత్రలో ఈయన ఈ
మూవీ లో కనిపించబోతున్నట్లు , అలాగే ఈ సినిమాలో సిద్దు కనిపించబోయే విషయాన్ని కూడా మరికొన్ని రోజుల్లో ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే సిద్దు ఇప్పటికే
డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ విజయాలతో తెలుగులో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ
యువ నటుడు
మిస్టర్ బచ్చన్ సినిమాలో నిజం గానే గెస్ట్ రోల్ లో నటించినట్లు అయితే ఈ
మూవీ పై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి సిద్దు నిజంగానే ఈ సినిమాలో నటించాడా ... లేక ఇదంతా రూమరా అనేది తెలియాలి అంటే ఈ
సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.