విడాకుల తర్వాత.. చాలా హ్యాపీగా ఉన్నా : స్టార్ హీరో భార్య
అయితే ఎవరైనా సినీ సెలబ్రిటీ జంటలు ఇలా విడాకుల ప్రకటించారు అంటే చాలు ఇక వారి గురించి సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విడాకుల తర్వాత తమ జీవితం ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా ఇక అభిమానులు అందరితో సెలబ్రిటీలు పంచుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే తన భర్తతో విడాకులు ఇచ్చిన తర్వాత తాను ఎంతో సంతోషంగానే ఉన్నాను అంటూ చెబుతుంది ఒక సెలబ్రిటీ. ఆమె ఎవరో కాదు ఒక స్టార్ హీరో భార్య. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇలా విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు.
అమీర్ ఖాన్ నా జీవితంలోకి రాకముందు నేను చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్నాను. ఆ సమయంలో ఒంటరితనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాకు కుమారుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు. అయితే ఇరు కుటుంబాలు నాకు అండగా ఉండడంతో ఎలాంటి భయం లేదు. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు కిరణ్ రావు. గతంలో ప్రేమించి మరి అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న కిరణ్ రావు ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇక విడాకులు తీసుకొని వేరుగా ఉండడానికి రెడీ అయిపోయారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కొడుకు కోసం అమీర్, కిరణ్ రావు కలుస్తూనే ఉంటారు.