ఆ హీరోయిన్ కి అన్యాయం చేస్తున్న టాలీవుడ్..?
అయితే సినిమా ఆఫర్లు రావట్లేదని డీలా పడకుండా అమ్మడు ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. ఈమధ్య గ్లామర్ డోస్ కూడా పెంచేసిన ప్రగ్యా స్కిన్ షోతోనే ఫాలోవర్స్ కు పిచ్చెక్కిస్తుంది. ప్రగ్యా లాంటి అందగెత్తికి అసలు అవకాశాలు ఎందుకు రావట్లేదంటూ ఆడియన్స్ కూడా డౌట్ పడేలా అమ్మడు రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా ప్రగ్యా యెల్లో కలర్ డ్రెస్ లో గ్లామర్ టాఎంట్ చూపిస్తుంది.
సినిమాల కన్నా ఫోటో షూట్స్ తోనే పాపులారిటీ తెచ్చుకుంటున్న భామలు ఉన్నారు. ఐతే ఆల్రెడీ ప్రగ్యా అందరికీ తెలుసు కాబట్టి ఆమె షేర్ చేస్తున్న ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడు ఇలా ఫోటో షేర్ చేస్తే చాలు అలా వైరల్ అయిపోతుంది. సినిమా ఛాన్సుల విషయంలో వాళ్లను వీళ్లని అడగడం కన్నా ఇలా సోషల్ మీడియాలో రెచ్చిపోతే తన గురించి డిస్కర్షన్ పెట్టేస్తారన్న లాజిక్ పట్టేసింది అమ్మడు. మరి ఈ గ్లామర్ షో అంతా ఆఫర్ల కోసమే అని తెలుస్తున్నా.. అమ్మడి కష్టాన్ని చూసి కూడా ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు పాపం. ఆమెను కావాలనే తీసుకోవట్లేదా లేదా మరో కారణం ఏమైనా ఉందా అన్నది కూడా బయటకు రావట్లేదు.