దేవర విషయంలో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ కు కారణం అదేనా..?

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో హైప్ విపరీతంగా ఉంది. అలాగే, వార్ 2 చిత్రంతో బాలీవుడ్‍లోనూ ఎన్టీఆర్ అడుగుపెడుతున్నారు. హృతిక్ రోషన్‍తో కలిసి ఈ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇక స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనూ ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నారు.దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‍గా చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సంవత్సరం ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్ ఒక్కడే కల్కి సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. ఇక సెకండాఫ్ లో కూడా పెద్దగా సినిమాలు ఏమీ రావడం లేదు. ఇక వచ్చే సినిమాల్లో దేవర సినిమా ఒకటే ప్రస్తుతం భారీ అంచనాలతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
  అయితే డిసెంబర్ 6వ తేదీన 'పుష్ప 2'సినిమా రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ అది సాధ్యం అయ్యే విధంగా కనిపించడం లేదు. దానివల్లే ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ లో దేవర సినిమా మాత్రం కచ్చితంగా వస్తుంది. ఇక ఈ సినిమా మీదనే ప్రేక్షకులు కూడా మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నవాడవుతాడు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ ను పెడుతున్నారట.   ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందంటూ సినిమా మేకర్స్ అయితే మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అయితే ఈ సినిమా ఔట్ పుట్ కూడా చాలా బాగా వచ్చిందట. అందుకే వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది...మరి ఎన్టీఆర్ అంతటి మ్యాజిక్ ను చేసి 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది... ఒకవేళ ఈ సినిమాతో కనక 1000 కోట్లు వచ్చినట్టైతే ఎన్టీఆర్ పాన్ ఇండియాలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతాడు...ఇక దాంతో పాటుగా ఆయన చేస్తున్న వార్ 2 సినిమా మీద కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: