ఈ సంవత్సరం రీ రిలీస్ కి రెడీగా ఉన్నా 7 సినిమాలు ఇవే.. విడుదల తేదీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కూడా రీ రిలీజ్ కు రెడీగా అనేక సినిమాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన తేదీలు కూడా అనౌన్స్ అయ్యాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా రూపొందిన విక్రమార్కుడు సినిమాను జూలై 27 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది.
నాని హీరో గా సమంత హీరోయిన్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాని ఆగస్టు 2 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు మూవీ ని ఆగస్టు 8 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి మూవీ ని ఆగస్టు 9 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్ లుగా  బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఇంద్ర సినిమాను ఆగస్టు 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు.
అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన శివ మూవీ ని ఆగస్టు 29 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: