ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... సమంత ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. మలయాళ నటుడు పహాధ్ ఫాజల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించిన ఈ సినిమాలో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు.
ఇకపోతే ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లోని ఈయన నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమా రెండవ భాగాన్ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.
కొన్ని రోజుల క్రితం ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి సినిమాలో అనేక మంది చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇదే ఫార్ములా ను పుష్ప పార్ట్ 2 మూవీ లో సుకుమార్ ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిన్న చిన్న ఇంపార్టెంట్ పాత్రలు ఉన్నట్లు అందులో బాలీవుడ్ నటుడు రన్వీర్ సింగ్ , కోలీవుడ్ నటుడు సూర్య కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. వీరు నిజంగానే ఈ సినిమాలో కనిపించినట్లు అయితే ఈ మూవీ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.