కొన్ని సంవత్సరాల క్రితం చిన్న వయసు వారు ప్రేమ అంటే అందనంత దూరం పరిగెత్తేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా మారిపోయాయి. సెల్ ఫోన్లు , ఇంటర్నెట్ కాలం రావడంతో చిన్న పిల్లలు కూడా ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రేమ అనే దానిపై కనీస అవగాహన లేకుండా కూడా ఇద్దరు అమ్మాయి , అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా అనేకం చూసాం. ఇకపోతే కొంత మంది మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి , మేజర్ అయిన అమ్మాయి లేని అబ్బాయి ప్రేమలో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి వాటి వల్ల కూడా అనేక తీవ్ర పరిస్థితులు ఎదుర్కొన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక అలాంటి వాటిలో ఒక సంఘటనే తాజాగా చోటుచేసుకుంది. చెన్నై శివారులో గల పెరియమెట్ లో 22 ఏళ్ల యువతి ట్యూషన్ చెప్పుతో కాలాన్ని గడుపుతుంది. ఇక తాజాగా ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడు ఈమె ప్రేమలో పడ్డాడు. ఇక ఈ మధ్య కాలంలో ఆ ట్యూషన్ టీచర్ ఈ మైనర్ బాలుడిని దూరం పెడుతుంది అనే మనస్థాపంతో ఈ బాలుడు అనేక పద్ధతుల ద్వారా ఆ యువతని వేధించడం మొదలు పెట్టాడు.
అందులో భాగంగా ఆ యువతి పేరుతో ఆమె అడ్రస్ కి వందలాది క్యాష్ అండ్ డెలివరీ ఆర్డర్ లను చేయడం , వారు అందరూ వచ్చే ఆమెను డెలివరీ ఉంది అని అడగడం , నేను చేయలేదు అని చెప్పి పంపించడం ఇలా జరుగుతూ వచ్చింది. అలాగే అనేక సార్లు ఉబర్ , ఓలా రైడ్ లను కూడా బుక్ చేయడం వారందరూ వచ్చే వీరిని అడగడం వీరికి ఏమి చేయాలో పలు పడక ఆ యువతి ఇంటి సభ్యులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో ఆ యువకుడిని పట్టుకున్నారు. ఇక ఇలాంటి సంఘటన తాజాగా చెన్నైలో జరిగింది.