టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ జంటగా నటించిన సినిమా 'హరోం హర'. కొత్త డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై డీసెంట్ టాక్ ని అయితే తెచ్చుకుంది కానీ వసూళ్లు పెద్దగా రాబట్టలేకపోయింది. కానీ సుధీర్ పెర్ఫార్మన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. తన బావ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సుధీర్ బాబు పెర్ఫార్మన్స్ ని మెచ్చుకున్నాడు.అయితే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేక ఫెయిల్ అయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం అదరగోడుతుంది. ఓటిటిలో ఈ చిత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫాంల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్ 1లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో సుధీర్ బాబు కష్టం వృధా పోలేదు.ఈ సినిమా కథంతా కూడా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు.
వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని చంపేస్తూ ఉంటారు. అయితే తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు హీరో సుబ్రమణ్యం(సుధీర్ బాబు). ఆ కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో అతను ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో సుధీర్ బాబు గొడవపడతాడు.ఆ విషయం శరత్ కి తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తన తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? ఈ అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అతని తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ మాఫియా లీడర్‌కు ఓ ఊరు మొత్తం కూడా ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే.