హార్దిక్ కోసం.. ఆ హీరోయిన్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందట తెలుసా?
ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే నటాషా తో హార్దిక్ పాండ్యా విడిపోతున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది నిజం కాకపోయి ఉండొచ్చు అని అభిమానులు అనుకున్నారు. కానీ ఇటీవల విడాకులకు సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన రావడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇలా భార్య నటాషా తో అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. కొడుకుతో కలిసి ఇప్పుడు నటాషా సొంత దేశమైన స్వీడన్ కు వెళ్ళిపోయింది. కాగా భార్యతో విడాకులు తీసుకున్న హార్దిక్ ఒక బాలీవుడ్ హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు అనన్య పాండే. ఇక ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా వస్తుంది అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. ఇక హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. దీనికి తోడు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే ఇక వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే హార్దిక్ పాండ్యా కోసం తన పాత ప్రియుడు అయిన ఆదిత్య రాయ్ కపూర్ కి సైతం అనన్య పాండే బ్రేకప్ చెప్పేసింది అంటూ వార్తలు వైరల్ గా మారిపోయాయి.