సింగర్ సునీత కూతుర్ని చూసారా.. స్టార్ హీరోయిన్స్ నే మించిపోయిందిగా..!?

Anilkumar
సింగర్ సునీత ఎన్నో అద్భుతమైన పాటలను పాడి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో పాటలకు తన అందమైన గాత్రంతో ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన పాటలు వింటే ఖచ్చితంగా మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. సరికొత్త సంగీత ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది సింగర్ సునీత. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎన్నో అవార్డులను అందుకుంది. కేవలం గాయని గాని కాకుండా ఎన్నో సినిమాలకి డంపింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన వాయిస్ అందించింది.

 టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్ లకి డబ్బింగ్ చెప్పింది సునీత. అలాగే బుల్లితెరపై పలు సింగింగ్ షోలకి కూడా జడ్జ్ గా వ్యవహరించింది. 19 ఏళ్ల వయస్సులోనే ఆమె పెళ్లి చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత బిజినెస్ మ్యాన్‌ రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. ఇలా ఆమె రెండో పెళ్లి చేసుకున్న నాటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఉన్నట్లుండి నెల రోజుల్లోనే నిశ్చితార్థం, పెళ్లి రెండూ పూర్తి చేసింది. 2011 జనవరి 9న ఈ ఇద్దరి పెళ్లి శంషాబాద్ శివార్లలో

 ఉన్న రామాలయంలో ఘనంగా జరిగింది. ఇదిలవుండగా  ప్రస్తుతం సింగర్ సునీత కూతురి ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. సింగర్ సునీత చాలా ఏళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి తన కూతురు శ్రేయ, కుమారుడు ఆకాష్ ఇద్దరిని చూసుకుంటున్నారు. ఇప్పటికే తనయుడు ఆకాష్ సర్కార్ నౌకరి ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. మెసేజ్ ఓరియెంటెడ్ తో అడియన్స్ ముందుకు వచ్చిన ఆకాష్ నటనపరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక కూతురు శ్రేయ అందంలో తల్లిని మించిపోయింది.  ప్రస్తుతం ఉన్నత చదువుతున్న శ్రేయ.. ఇప్పటికే నాగచైతన్య నటించిన సవ్యసాచి లో టిక్ టిక్ టిక్ అనే పాట పాడింది. అలాగే తన ఇన్ స్టాలో పలు పాటలు పాడుతూ వీడియోస్ షేర్ చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: