టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన వారసుడు ఆకాష్ పూరిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలు సినిమల్లో నటించిన ఆకాష్ పూరి హీరోగా కూడా మారాడు. ఆకాష్ నటనకు ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇది ఇలా ఉంటే ఈ హీరోకి సంబంధించిన వార్త ఒకటి తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే సినీ ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం కొత్త విషయం కాదు. అయితే ప్రతిసారి ఈ మార్పు వెనుక ఒక కారణం ఉంటుంది. ఆకాష్ పూరి కూడా తన పేరును
మార్చుకోవడానికి కొన్ని కారణాలు చెప్పారు. చాలా మంది సినీ ప్రముఖులు తమ పేర్లను న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటారు. అయితే ఆకాష్ పూరి కూడా ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక కొత్త చిత్రంతో లేదా కొత్త అధ్యాయంతో ప్రారంభించే ముందు నూతన ఇమేజ్ కోసం పేరు మార్చుకోవడం కొందరికి ఇష్టం. ఆకాష్ పూరి కూడా ఈ కోణంలో ఆలోచించి ఉండవచ్చు అని చెప్పవచ్చు. ఇక పేరు మార్చుకోవడం వల్ల కెరీర్లో మార్పు వస్తుందని చెప్పలేం. అయితే ఒక కొత్త పేరు కొత్త ఆరంభానికి సంకేతంగా
నిలుస్తుంది. ఇది ఇలా ఉంటే తన పేరును ఆకాష్ పూరి నుంచి ఆకాష్ జగన్నాధ్ గా మార్చుకుంటున్నట్లు ఈ యంగ్ హీరో ప్రకటించాడు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ ఇలా తన పేరును మారుస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. తండ్రి పేరు కలిసేలా ఆకాష్ పూరి ఉండగా, ఇప్పుడు కొత్త పేరులోనూ తండ్రి పేరు జగన్నాధ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆకాష్ జగన్నాథ్ పేరుతో ఆయన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీనితో ఆకాష్ పూరి పేరు మార్చుకున్న విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త పేరుతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి కొందరు ఈ మార్పును ఆసక్తికరంగా భావిస్తున్నారు.