మూవీ ఇండస్ట్రీకి చెందిన చాలా సెలబ్రిటీలు తమ పేర్లు కొంచెం మార్చుకోవడం.. లేదా పేర్లలో
లెటర్ యాడ్ చేయడం, తీసేయడం లాంటివి కామన్ గా చేస్తూ ఉంటారు.వారి పేర్ల ముందు వెనుక ఏదో ఒకటి కొత్తగా చేర్చడం.. లేదంటే ఏదో ఒకటి జతచేసిన పదాలను తీసేయడం.. లాంటివి చాలా మంది విషయంలో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇదే విధంగా ఓ యంగ్
హీరో కూడా తన పేరులో జతచేసిన ఓ పదాన్ని తీసేసి మరో పదాన్ని యాడ్ చేసుకున్నట్లు సోషల్
మీడియా వేదికగా అఫీషియల్ ప్రకటన చేయడం జరిగింది. ఇంతకీ ఆ
హీరో ఎవరు తన కొత్త పేరు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఆ
యువ హీరో ఎవరో కాదు
ఆకాష్ పూరి.
టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన
ఆకాష్ గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. పలు సినిమాల్లో కూడా నటించాడు. ఇక 2018 వ సంవత్సరంలో
మెహబూబా సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఈ
మూవీ తర్వాత ఆంధ్ర పోరి, రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు ఆకాశ్.
అయితే గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆకాష్.. ప్రస్తుతం మాత్రం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిస్తున్నాడు. ఈ క్రమంలో జులై 25 వ తేదీన (నేడు) తన పుట్టినరోజు సందర్భంగా పేరు మార్చుకుంటున్నట్లు సోషల్
మీడియా వేదిక ద్వారా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు.అయితే ఇన్నాళ్లు తనని
ఆకాష్ పూరి అని పిలిచారని.. ఇప్పుడు
ఆకాష్ జగన్నాథ్ అని పేరు తాను మార్చుకున్నట్లుగా అతను వివరించాడు. అయితే
ఆకాష్ తన పేరు చివర పెట్టుకున్న ఈ రెండు పేర్లు కూడా
తండ్రి పేరులే కావడంతో.. ఇంత సడన్గా అసలు ఇప్పుడు అతను పేరెందుకు మార్చినట్లు.. పైగా
పూరి లేదా జగన్నాత్ ఈ రెండు కూడా
తండ్రి పేరులే కదా వాటిని మార్చడం వల్ల ప్రయోజనం అనేది ఏమై ఉంటుంది. కెరీర్ పరంగా కలిసి రావాలని ఉద్దేశంతో ఎవరైనా ఇచ్చిన సలహాతో ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడా అంటూ.. పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. పేరుకి పూరీ జగన్నాథ్ కొడుకే అయిన ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు ఆకాశ్. మరి ఫ్యూచర్లో స్టార్
హీరో అవుతాడో లేదో చూడాలి.