రామ్ పోతినేనిని మరోసారి ఓ మాస్ అవతార్ లో చూపించిన మూవీ స్కంద. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే ఇప్పుడీ సినిమా హిందీ వెర్షన్ మాత్రం యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెల రోజుల్లోనే ఓ అరుదైన మైలురాయిని ఈ సినిమా అందుకోవడం విశేషం.రామ్ పోతినేని, శ్రీలీల నటించిన స్కంద మూవీ గతేడాది సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.స్కంద’ అంటే కుమారస్వామి కానీ.. రామ్‌ని నరసింహస్వామి అవతారంలో చూపించాడు బోయపాటి. ఇంతకు ముందు సినిమాల్లో చూసిన నరుకుడు మొత్తం ఓ లెక్క అయితే.. ‘స్కంద’లో నరుకుడు మాత్రం వీరలెవల్. ఓర్నాయనో.. ఇదేం నరుకుడురా అయ్యా అనేట్టుగా ఊచకోత కోయించేశాడు. మాస్ డైరెక్టర్ చేతిలో మాస్ హీరో పడితే.. ఉప్పొచ్చి నిప్పుపై పడ్డట్టే. చిటపటలు మామూలుగా ఉండవు. ‘స్కంద’ కూడా అలాంటిదే. సినిమా మొదలైంది మొదలు ఎండ్ కార్డ్ పడే వరకూ కూడా నరుకుడే నరుకుడు. రక్తం ఏరులైపారింది.అయితే రామ్ పోతినేని, శ్రీలీల నటించిన స్కంద మూవీ గతేడాది సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైంది. అయితే తాజాగా నెల రోజుల కిందట ఈ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్ లోకి వచ్చింది. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ.. హిందీ వాళ్లకు మాత్రం తెగ నచ్చేసింది. అందుకే నెల రోజుల్లోనే యూట్యూబ్ లో ఈ సినిమాకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి.అంతేకాదు 1.1 మిలియన్ లైక్స్ కూడా రావడం విశేషం. ఈ మాస్ యాక్షన్ మూవీ హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు యూట్యూబ్ లో నమోదైన ఈ అరుదైన రికార్డే చెబుతోంది. స్కంద పేరుతోనే హిందీలోనూ ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా తీసుకెళ్లారు. జూన్ 17న వామ్ఇండియా మూవీస్ ఈ స్కంద హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.అయితే అనూహ్యంగా ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొన్నేళ్లుగా సౌత్ లో రూపొందిన మాస్ యాక్షన్ సినిమాలను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న విషయం తెలుసు కదా. అలాగే మన వాళ్లకు నచ్చని ఈ స్కందను కూడా అక్కున చేర్చుకున్నారు.