టాలెంటెడ్ డైరెక్టర్ ని పట్టేసిన నితిన్..!

shami
నితిన్ హీరోగా హ్టిలు ఫ్లాపులు ఈక్వెల్ గా చేస్తూ వస్తున్నాడు. నితిన్ ఒక సినిమా పర్వాలేదు అనిపించుకుంటే మరో సినిమా నిరాశ పరుస్తుంది. ఐతే ఏది ఎలా ఉన్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు నితిన్. ఇప్పటికే వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్న నితిన్ ఆ సినిమాతో పాటుగా వేణు శ్రీరాం తో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. ఈ రెండు పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు నితిన్.
అందులో ముఖ్యంగా నైంటీస్ వెబ్ సీరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. నైంటీస్ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ని అలరించిన ఆదిత్య హాసన్ ఈసారి నితిన్ తో సిల్వర్ స్క్రీన్ పై తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. నితిన్ ని కలవడం కథ చెప్పడం అంతా జరిగింది. కచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తుంది. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు వస్తాయి. నైంటీస్ వెబ్ సీరీస్ అది కూడా ఈటీవీ విన్ లో రిలీజై ప్రేక్షకులను మెప్పించాడు ఆదిత్య హాసన్. ఆ క్రేజ్ తోనే ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసి మెప్పించాడు. నితిన్ ఆదిత్య హాసన్ కాంబో మెగా ఎంటర్టైనర్ మూవీ రాబోతుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎప్పుడుస్ సెట్స్ మీదకు వెళ్తుంది. సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. రాబిన్ హుడ్ సినిమా ఈ డిసెంబర్ కి ప్లాన్ చేశారు మేకర్స్. ఐతే పెద్ద సినిమాలన్నీ డిసెంబర్ కి వసుండటం వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. తమ్ముడు సినిమా మాత్రం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: