అమ్మమ్మ కావాల్సిన వయసులో తల్లి కావాలనుకుంటున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
అలాగే తనకు స్టార్ హీరో అయినా అమితాబ్ బచ్చన్ కు కూడా ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలతో చాలా కృంగిపోయిందట. ఈ క్రమంలోనే తాజాగా రేఖ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్ ఇన్ ద చెక్కర్లు కొడుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..'నాకు చాలామంది పిల్లలు కావాలి అనుకున్నాను. తల్లి కావాలనే నా కోరిక నెరవేరుతుందని నమ్ముతున్నాను. మా అమ్మ 30 ఏళ్లలోపు పిల్లలు పుట్టాలని ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉందని నాకు కూడా అనిపించింది. నా పిల్లలు నాతో పాటు ఎదగాలని..నాకు, వాళ్లకు మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు అని అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనెప్పుడూ 100 ఏళ్లు ముందుకే ఆలోచిస్తాను. అలాగే నేను ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాను. కానీ ఇంట్లో ఒంటరితనాన్ని తగ్గించడానికి నాకు ఇల్లు నిండుగా పిల్లలు కావాలి. అయితే పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు. ఎందుకంటే నేను మా అమ్మను చూశాను. నాన్న మమ్మలని పట్టించుకోలేదు. దీనితో అమ్మ ఒక్కతే ఎన్నో కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచింది. అందుకే పిల్లలను ఒంటరిగా చూసుకోవటం అంత సులువు కాదని నాకు తెలుసు. నాకు బిడ్డ ఎప్పుడూ పుడుతుందో తెలియదు..బహుశా అది ఇంకెప్పటికీ జరగదు కావచ్చు. 'అంటూ చెప్పుకొచ్చింది రేఖ. కాగా ఆమె ఇప్పటికీ తల్లి కాలేక పోయింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.