అటువంటి డ్రెస్ లో మెరిసిన అమలాపాల్.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!
ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. అందులో భాగంగానే రీసెంట్ గా కేరళలోని ఎర్నాకులంలోని ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్ కు హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో ఆమె వేసుకున్న డ్రెస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆమె దుస్తులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. విద్యా సంస్థలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్స్ కు కాస్త పద్ధతిగా వెళితే బాగుంటుందని. పొట్టి దుస్తులలో వెళ్లి విద్యార్థులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు. అయితే తన డ్రెస్ పై వస్తున్న విమర్శల పై అమల పాల్ కూడా స్పందించింది.
ఆ డ్రెస్ లో తాను కంఫర్ట్ గానే ఉన్నానని తెలిపింది. 'కాలేజీలో జరిగిన ఈవెంట్లో నేను ధరించిన డ్రెస్ నాకు చాలా సౌకర్యంగా ఉంది. ఇలాంటి దుస్తులు వేసుకుని ఆ ఈవెంట్ కు వెళ్లడం తప్పుగా అనిపించలేదు. నిజానికి నా దుస్తుల కంటే, ఆ ఫోటోలు తీసిన వారిదే అసలు సమస్య. వారు నా ఫోటోలు ఎలా తీశారు అనేది చర్చ జరగాల్సిన అంశం. ఆ దుస్తులలో నన్ను చూడటం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంగా అనిపించలేదు. నేను మోడ్రన్ డ్రెస్‌లతో పాటు సాంప్రదాయ దుస్తులు కూడా ధరిస్తాను. కాలేజీకి నేను ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళటం వెనుక ఉద్దేశం విద్యార్థులలో అద్యస్టైర్యాన్ని నింపడానికే" అంటూ చెప్పుకొచ్చింది.