సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద స్టార్ నటుడు అయినప్పటికి కూడా ఎంతో సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఇక సినిమా షూటింగ్‌లు లేకపోతే తన కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఇష్టపడుతుంటారు.సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత సింపుల్ లైఫ్‌ను లీడ్ చేస్తారో అందరికీ తెలిసిందే. నిత్యం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ స్టార్ హీరో..ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో విలువైన సమయాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు తాజాగా గ్రాండ్‌ఫాదర్ బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేశారు. తాజాగా ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.శుక్రవారం తన కుమారుడు వేద్ పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని చెప్పింది. అయితే.. సూపర్ స్టార్ అయిన తాత అతడిని స్వయంగా పాఠశాలకు తీసుకువెళ్లాడంది. అంతేకాదు.. మనువడి క్లాస్ రూమ్‌కి వెళ్లిన రజినీకాంత్ అక్కడ ఉన్న ఇతర పిల్లలను సంతోషపెట్టారని చెప్పింది. ‘ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా.. ఏం చేసినా అతనే కింగ్, లవ్ యూ ఫాదర్’ అంటూ సౌందర్య పోస్ట్ చేసింది.రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం 'వేట్టయాన్' . 'జై భీమ్' ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.అదేవిధంగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 'కూలీ'. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.