నాగార్జున: మూవీస్ వద్దు.. బిగ్ బాసే ముద్దు?

Purushottham Vinay

బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు.ప్రతి సీజన్ కి కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ హోస్ట్ పై కూడా రకరకాల చర్చలు జరిగేవి. కానీ సీజన్ 8 మొదలవుతున్న ఈ టైంలో కంటెస్టెంట్స్ ఎవరెవరని హడావిడి చేస్తున్నారు తప్ప హోస్ట్ గురించి ఎలాంటి డిస్కషన్స్ అనేవి రావట్లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు.ఇంకా అంతేకాదు రాబోయే సీజన్లకు మాక్సిమం నాగ్ సార్ తోనే కొనసాగించేలా బిగ్ బాస్ టీం బలంగా ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే నాగార్జున కాకుండా బిగ్ బాస్ ని హ్యాండిల్ చేయడం కాస్త కష్టమే అవుతుంది. ఎలాగు అలవాటు పడ్డాం కాబట్టి ఒక 20, 30 రోజులు డేట్స్ ఇచ్చేద్దామని నాగార్జున కూడా మూవీస్ కంటే ఈ బిగ్ బాస్ కే బాగా ఫిక్స్ అయ్యారు. ఐతే బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేస్తున్నందుకు మూవీస్ కంటే ఒక రేంజ్ లో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇంతకు ముందు 20 కోట్ల దాకా ఉన్న రెమ్యునరేషన్ ఈ సీజన్ కి 10 పెంచి ఏకంగా 30 కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తుంది.బిగ్ బాస్ టీం కు వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. 


ఇంకా అంతేకాదు పైగా ఈ బిగ్ బాస్ సెట్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంది. దానికి ఎంతో కొంత ఛార్జ్ అనేది ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేయడం వల్ల అక్కడ నుంచి లీక్స్ అనేవి బాగా వస్తున్నాయని ఈసారి బిగ్ బాస్ హౌస్ ని మార్చేయాలని అనుకున్నారు. కానీ ఈ సీజన్ వరకు అక్కడే ఉండి.. లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడాలని బిగ్ బాస్ టీం వారు చూస్తున్నారు.ఇక స్టూడియోకి రెంట్ ప్లస్ తన రెమ్యునరేషన్ ఇలా రెండు విధాలుగా నాగార్జున భారీగా లాభపడుతున్నారు. కేవలం రెమ్యూనరేషన్ కోసమే ఏకంగా 30 కోట్లు అడుగుతున్నట్టు తెలుస్తుండగా స్టూడియో రెంట్ కోసం ఎంత డిమాండ్ చేస్తున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. సో ఇంత లాభం వస్తుందంటే నాగార్జున బిగ్ బాస్ ని ఎందుకు వదులుకుంటారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని సమాచారం తెలుస్తుంది. ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీస్, బుల్లితెర యాంకర్లు, సీరియల్ స్టార్స్ ఇలా వీరితోనే షో నడిపించాలని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: