మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ , సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇక ఈ మూవీ లో ఈమె తన నటనతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు కలిగిన సినిమాలలో అవకాశం రావడం మొదలు అయింది. ఇక ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.
అందులో చాలా మూవీ లు మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.
ఇక అలా టాప్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లి మంచి అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ఈమె తెలుగు లో సినిమాలు చేయకుండా తమిళ్ , హిందీ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. ఇక ఈమెకు తమిళ్ , హిందీలో అవకాశాలు భారీగానే వస్తున్న అవి ఏమాత్రం సక్సెస్ కావడం లేదు. కొంత కాలం క్రితం ఈమె తమిళ్ లో శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అయాలాన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే తాజాగా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 మూవీ లో ఈ బ్యూటీ సిద్ధార్థ్ కి లవర్ పాత్రలో నటించింది.
ఇక ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక హిందీలో కూడా ఈమెకు చెప్పుకోదగ్గ భారీ విజయాలు రావడం లేదు. దానితో చాలా మంది తెలుగులో ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉంది. తెలుగులో సినిమాలు చేస్తూ ఉంటే ఈమె కెరియర్ చాలా కాలం అదే స్థాయిలో ముందుకు సాగేది. అనవసరంగా ఈమె తమిళ్ , హిందీ పై ఇంట్రెస్ట్ చూపింది. అక్కడ ఈమెకు అవకాశాలు వచ్చిన అవి సక్సెస్ కావడం లేదు. అందుకే ఈమె కెరియర్ గ్రాఫ్ పడిపోతుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.