మెగా
పవర్ స్టార్ రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అద్భుతమైన నటనతో
టాలీవుడ్ లో స్టార్హీరోగా ఎదిగిన రాంచరణ్
రాజమౌళి తెరకెక్కించిన
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారారు.ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ”
గేమ్ ఛేంజర్ “..తమిళ్ స్టార్
డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో రాంచరణ్ సరసన
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా
టాలీవుడ్ స్టార్
ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమానుభారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో క్యూట్
బ్యూటీ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్
డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడో మొదలైన దర్శకుడు
ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ గా ఉండటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమాలో
హీరో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నారు..త్వరలోనే ఈ
సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని దర్శకుడు
శంకర్ భావిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాలో రాంచరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. తాజాగా
శంకర్ తెరకెక్కించిన
ఇండియన్ 2 రిలీజ్ అయింది.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. దీనితో ఆ ఎఫెక్ట్ చరణ్ సినిమాపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే రాంచరణ్
గేమ్ ఛేంజర్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు సంబంధించిన రషెస్
శంకర్ దగ్గరే భద్రంగా వుంది. ఇంత వరకు
దిల్ రాజుకు గాని, రాంచరణ్ కు గాని చూపించలేదు. త్వరలోనే ఈ
సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని
శంకర్ చెబుతున్నారు.
ఇండియన్ 2 ఫెయిల్యూర్ కావడంతో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.
సినిమా ఎలా జరుగుతుందో ఒక సారి పరిశీలించండి అని
దిల్ రాజుకు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా భాద్యత
దిల్ రాజుని తన చేతిలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.