బాక్స్ ఆఫీస్: రాయన్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Purushottham Vinay

తమిళ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా రాయన్. ఆయన స్వీయ దర్శకత్వంలోనే రాయన్ సినిమా ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మాస్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమాని ధనుష్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇలాంటి కథలకి తమిళనాట మంచి మంచి ఆదరణ ఉంటుంది. ఇంకా అలాగే ధనుష్ హీరో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ కి కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దీంతో ఈ సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టడం కష్టం అనే మాట బాగా వినిపించింది.అయితే  రాయన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ స్టడీగా ఉండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఏకంగా 23.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.అయితే ధనుష్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద నెంబర్ అని తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా 1.6-1.8 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని భావించారు. అయితే అనూహ్యంగా 2.6 కోట్ల గ్రాస్ మొదటి రోజు రాయన్ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఊపు అందుకుంది. పైగా ఆయన డబ్బింగ్ సినిమాలలో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే కావడం విశేషం.


5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయ్యింది. మొదటి రోజు కలెక్షన్స్ లెక్కన చూసుకుంటే మరో 4.14 కోట్ల షేర్ అందుకుంటే ఈ మూవీ హిట్ బొమ్మ అవుతుంది.ఇప్పటి దాకా 1.36 కోట్ల షేర్ ని ఈ సినిమా శుక్రవారం అందుకుంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో శని, వరాల కలెక్షన్స్ పెరుగుతాయనే మాట వినిపిస్తోంది. ఇక తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజు 10.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ముఖ్యంగా రాయన్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ లో ఎక్కువ ప్రేక్షకాదరణ లభించినట్లు సమాచారం తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే 23.40 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు రాయన్ సినిమా వసూళ్లు చేయగా అందులో మొత్తం 11.20 కోట్ల షేర్ ఉంది. 46 కోట్ల తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ టార్గెట్ అందుకోవాలంటే ఇంకా 34.80 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీకెండ్ తర్వాత కూడా మంచి కలెక్షన్స్ ని అందుకుంటేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: