'యానిమల్ ' కాంట్రవర్సీ పై రణ్ బీర్ కపూర్ షాకింగ్ వ్యాఖ్యలు..!!

murali krishna
రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో.. అంతకంటే ఎక్కువ విమర్శలే ఎదుర్కొంది. అయితే ఈ విమర్శలపై ఇన్నాళ్ల తర్వాత మూవీలో లీడ్ రోల్ పోషించిన రణ్‌బీర్ కపూర్ స్పందించాడు. ఈ విమర్శలను తాను అంగీకరించనని, అయితే ప్రస్తుతం తాను ఎవరితోనూ వాగ్వాదానికి దిగే పరిస్థితి లేక మళ్లీ ఇలా చేయనని చెప్పినట్లు అతడు వెల్లడించాడు.యానిమల్ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించవచ్చు. రన్బీర్ కపూర్ కెరీర్ లో హయ్యస్ట్ వసూళ్లు తెచ్చి పెట్టిన సినిమా కావచ్చు. కానీ ఆ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు వున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ పెద్దలకు నచ్చలేదు. అందులో వుండే కంటెంట్ ని కపూర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితంగా వుండేవాళ్ళు తీవ్రంగా ఆక్షేపించారు. బయటికి చెప్పకపోయిన కపూర్ వారస్వతం కొనసాగిస్తున్న హీరో ఇలాంటి సినిమా చేయడం సరికాదని, ఇది భావితరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిచూస్తుందని, అంత స్త్రీద్వేషాన్ని రెచ్చగొట్టే కథలు మంచిది కాదని, ఇకపై అలాంటి సినిమాలు వద్దుని రన్బీర్ ని పర్శనల్ గా కలసి చెప్పారు.ఓ సోషల్ మీడియా ఈవెంట్ లో మాట్లాడిన ఆయన ‘యానిమల్ సినిమా పరిశ్రమలో చాలా మంది నా శ్రేయోభిలాషులకి నచ్చలేదు. ఇలాంటి కంటెంట్ నేను చేయడం వారు జీర్ణించుకోలేకపోయారు. వారికి క్షమాపణలు చెప్పాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాలో కూడా చాలా భయాలు వచ్చాయి. వసూళ్లు మాట పక్కన పెడితే ఆ సినిమా కంటెంట్ అంత నెగిటివ్ గా వెళుతుందని నేను ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు రన్బీర్. మొత్తానికి యానిమల్ పై చేలరేగిన వివాదాలన్నిటికీ రన్బీర్ తన క్షమాపణతో పుల్ స్టాప్ పెట్టినట్లేనని అనుకోవాలి.మరోసారి యానిమల్ లాంటి సినిమా చేస్తారా అని అడిగితే.. చేస్తానని అతడు చెప్పడం గమనార్హం. తన కెరీర్లో తాను సంతృప్త స్థాయికి చేరుకున్నానని, ఇప్పుడు యానిమల్ లాంటి సినిమాలే సరైనవని అతడు అన్నాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతోపాటు ఎంతో మంది ప్రేక్షకులు కూడా మూవీని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: