ఏపీ : కొత్త ఆశలతో వాలంటీర్లు.. మరి సీఎం..?

Divya
ఏపీ వాలంటరీలు ఉన్నారా లేదా అనే విషయం తెలియక చాలా సతమతమవుతున్నారు.. మూడు నెలలుగా విధులకు దూరంగా ఉన్న వాలంటీర్లను సైతం మళ్లీ వినియోగించుకుంటారా.. లేకపోతే కొత్తవారిని నియమిస్తారా అనే విషయం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.. అయితే ఖాళీలలో కొత్తవారిని నియమిస్తారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ కానీ మరి కొన్నిసార్లు అసలు వాలంటరీ వ్యవస్థ పైన ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీనే ఇవ్వలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది నేతలు అసలు వాలంటరీ వ్యవస్థ అనవసరం అన్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు.

కానీ ఇటీవలే మినిస్టర్ వీరాంజనేయ స్వామి ప్రకటనంతో వాలంటరీలలో కాస్త కొత్త ఆశలు రేపుతోంది. అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాలంటరీల వ్యవస్థ పైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ ఆ శాఖ మంత్రి  వీరాంజనేయ స్వామి ఇటీవలే ఒక ప్రకటనను కూడా తెలియజేశారు. వాలంటరీలతో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను పంపిణీ చేసింది. కేవలం 5000 రూపాయలు గౌరవ వేతనం కింద వారికి ఇచ్చేవారు. దీంతో చాలామంది వైసిపి కార్యకర్తలు వాలంటరీగా ఉన్నారని వాదనలను కూడా టిడిపి ఆరోపించింది.

ఎన్నికల సమయంలో కూడా వీరిని విధుల నుంచి దూరంగా ఉంచాలని కూడా తెలియజేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ కూడా వాలంటరీలను ఎన్నికల సమయంలో దూరంగా ఉంచేలా ప్లాన్ చేశారు. అయితే ఎన్నికలు జరిగి ఇప్పటికీ రెండు నెలలు కావస్తూ ఉన్న వాలంటరీలకు పదివేల రూపాయలను చేస్తానని చెప్పిన ఏపీ సీఎం ఇప్పటివరకు ఏ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు కేవలం మంత్రులు మాత్రమే తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో 1,67,000 మంది వాలంటరీ లో ఉన్నారు. మొత్తం మీద లెక్క వేసుకుంటే రెండు లక్షల 65,000 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పథకాల పైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నప్పటికీ వాలంటరీ వ్యవస్థ మీద ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఉంచుతారా తీసివేస్తారా అనే విషయం మాత్రం త్వరలోనే క్లారిటీ వచ్చేలా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: