ప్రమాదానికి గురైన ప్రేమలు మూవి నటుడు.. షాక్ లో ఫ్యాన్స్..!
అయితే ఇదంతా కేవలం సినిమా షూటింగ్లో భాగంగా హై స్పీడ్ తో చేంజింగ్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఎంజీ రోడ్లలో ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే రక్తపు మడుగులో ఉన్న ఈ యాక్టర్స్ ను బైక్ రైడర్ తో సహా మరో ముగ్గురిని ఆసుపత్రికి హుటాహుటిగా అక్కడ ఉన్న సిబ్బంది తరలించారు. ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మరి దర్యాప్తు చేయగా.. డైరెక్టర్ అర్జున్ బోస్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలు వీరిద్దరూ నటిస్తున్నారట.
ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్న సమయంలో ఈ యాక్సిడెంట్ కావడంతో అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు యాక్టర్స్ ఆసుపత్రిలో చికిత్స సైతం పొందుతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు మూడు రోజులలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేవిధంగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వీరి గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది. అభిమానులు కూడా వీరిని త్వరగా కోలుకోవాలని మళ్లీ తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనాలంటు తెలియజేస్తున్నారు.