ఇదెక్కడి లైనప్ రా బాబోయ్.. సందీప్ నెక్స్ట్ మూవీలు ఇవే..?
సందీప్ కిషన్ కొంత కాలం క్రితం రాజు అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో కూడా సందీప్ కిషన్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక మాయా ఓనే అనే తమిళ్ సినిమాలో కూడా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతుంది. ఈ మూవీ ల తో పాటు నరగ సూరన్ అనే తమిళ సినిమాలో కూడా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ రూపొందుతుంది. వెబ్ అనే తెలుగు సినిమాలలో కూడా సందీప్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. ఇది న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ లతో పాటు SK 30 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న తెలుగు సినిమాలో కూడా సందీప్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది.