మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరిద్దరూ ఒకే దర్శకుడితో సినిమాలు నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా నటించిన దర్శకులలో ఒక దర్శకుడు మాత్రం ఇటు చిరంజీవి కి అటు రామ్ చరణ్ కు ఇద్దరికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందించాడు. ఆ దర్శకుడు ఎవరు ... ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
చాలా సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి , శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన అందరివాడు అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగాను , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.
ఇకపోతే శ్రీను వైట్ల , చిరంజీవి తో తెరకెక్కించిన అందరివాడు సినిమా వచ్చి చాలా సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బ్రూస్ లీ అనే సినిమాను రూపొందించాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూడా ఒక చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇలా శ్రీను వైట్ల ఇటు చిరంజీవి తో అందరివాడు అలాగే రామ్ చరణ్ తో బ్రూస్ లీ అనే సినిమాలను తలకెక్కించి రెండింటితో కూడా ఈ ఇద్దరు మెగా హీరోలకు అపజయాలను అందించాడు.