మోక్షజ్ఞ: ఫస్ట్ మూవీతోనే ఆ ప్రయోగమా? సాహసమనే చెప్పాలి?

Purushottham Vinay

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఈ ఏడాదిలోనే తన డెబ్యూ ఉండబోతోందని కన్ఫర్మ్ చేశాడు. ఇక తండ్రి బాలయ్య కూడా మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం చాలా కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ గా తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అప్పగించాడట.యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని చేయాలని అనుకుంటున్నాడు. మ్యాగ్జిమమ్ ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని సూపర్ హీరో కథలని చెప్పాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యతని కూడా తీసుకున్నారు.అందుకు మోక్షజ్ఞ కోసం బలమైన కథని ప్రశాంత్ వర్మ సిద్ధం చేస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన టాక్ ఒకటి బయటకొచ్చింది. మహాభారతంలో ఒక క్యారెక్టర్ బేస్ చేసుకొని కథని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. అంటే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతోనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ని అది కూడా పౌరాణికం రిఫరెన్స్ తో చేస్తున్న కథతో రాబోతున్నాడని అర్ధమవుతోంది.


అయితే అభిమాన్యుడి క్యారెక్టర్ కి మోక్షజ్ఞ మంచి ఛాయస్ అనే మాట నందమూరి అభిమానుల నుంచి బలంగా వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది దానిపై ఎవరికి కూడా క్లారిటీ లేదు. అతనిని ముందు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మొదటి చిత్రమే అభిమాన్యుడి లాంటి బలమైన పాత్ర అంటే కచ్చితంగా సాహసం అని చెప్పొచ్చు. పౌరాణిక సినిమాలపై ఈ రోజుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందువల్ల ఏమాత్రం తేడా కొట్టినా ట్రోలర్స్ కు ఛాన్స్ ఇచ్చినట్లే. అయితే ప్రశాంత్ వర్మ టాలెంట్ ను నమ్మొచ్చు. ఇక బాలయ్య అనుభవం కూడా యాడ్ అయితే కచ్చితంగా మంచి అవుట్ పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.ఇదంతా వర్క్ ఔట్ అయితే మాత్రం మోక్షజ్ఞ మొదటి చిత్రంతోనే స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది. త్వరలో ప్రశాంత్ వర్మ నుంచి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తోంది. అయితే మహాభారతంలో అభిమాన్యుడి కథని ప్రశాంత్ వర్మ చెబుతాడా లేదంటే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీని రాస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: