రెబల్ ఫ్యాన్స్ కి పండగే.. రాజా సాబ్ గ్లింప్స్ అప్డేట్ వచ్చేసిందే?

Purushottham Vinay

 ఆ దేశంలో బాహుబలి 2 రికార్డుని బద్దలకొట్టిన కల్కి?  రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. జూన్ 27 వ తేదీన ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. దీనికి మంచి టాక్ రావడంతో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే లభించింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకా పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 570 కోట్లు షేర్, రూ. 1175 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 


ఇక ఇదిలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. ఒకవైపు 'సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం' సినిమా చేస్తూనే ఈ సినిమాకు డేట్స్ కూడా కేటాయించాడు ప్రభాస్.ఆగష్టు నెలలో 'ది రాజాసాబ్' మూవీలో తన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ అనేది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను రేపు ఇవ్వనున్నాడు. 'ది రాజా సాబ్' ఫస్ట్ గ్లింప్స్ ను సోమవారం (29-7-2024) రోజు సాయంత్రి 5 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్టు మూవీ టీం నుంచి సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాని హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ ఆత్మ పాత్రలో కనిపించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కల్కి తో బాహుబలి లాంటి హిట్టు కొట్టిన ప్రభాస్ ఈ సినిమాతో కూడా అలాంటి హిట్టుని కొట్టాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్టుని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: