23 ఏళ్లుగా ఖుషి మూవీ రికార్డ్ పదిలం.. చెరపలేకపోతున్న పాన్ ఇండియా హీరోలు..!
అప్పట్లో ఖుషి సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు.. వాస్తవానికి ఈ సినిమా తమిళం నుంచి రీమిక్స్ చేశారు. రిలీజ్ సమయంలో ఈ సినిమా పైన నెలకొన్న బస్ అంత ఇంత కాదు..ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉపయోగించిన డైలాగుల తీరు, లుక్స్, డాన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆల్ టైం ఫేవరెట్ మూవీగా కూడా ఖుషి సినిమా ఉన్నది. ఇప్పటివరకు ఖుషి సినిమా రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉన్న ఆ రికార్డు ఏమిటంటే..
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్లో అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు నిలిచింది.. ప్రభాస్, బన్నీ, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏ హీరో కూడా ఇప్పటివరకు ఈ రికార్డును సైతం బ్రేక్ చేయలేకపోతున్నారట.. సంధ్య థియేటర్లో అప్పట్లో ఈ సినిమా రూ.1.56 కోట్ల రూపాయల వరకు క్రాస్ కలెక్షన్ రాబట్టిందట .ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ థియేటర్లో అంతటి కలెక్షన్స్ ని కొల్లగొట్టలేకపోతోందట. 2001లో రిలీజ్ అయిన ఈ ఖుషి సినిమా చివరిగా రూ.37 కోట్ల రూపాయలు కలెక్షన్స్ ని రాబట్టి భారీ హిట్టుగా నిలిచింది.