ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ సరికొత్త ప్రయోగం.. ఏకంగా అలాంటి పాత్రలో..?

murali krishna
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మన అందరికి తెలిసిందే.నందమూరి తారక రామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటుతో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్.ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరోవైపు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మీద చాలానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఈ మూవీ రెండు పార్టుల్లో వస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 రిలీజ్ కాకుండానే భారీ నుంచి అతి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్ డేట్స్ తో తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు తారక్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పైగా అందులో తారక్ ఒక ప్రయోగం కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు.. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా అనమాట.ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుందని గట్టిగానే టాక్ వినిపిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాదే  'డ్రాగన్' మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.'డ్రాగన్'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. అందులో ఒకటి యంగ్ డాన్ రోల్ కాగా, మరొకటి 75 ఏళ్ళ ఓల్డ్ డాన్ రోల్ అట. ఈ రెండు పాత్రల మధ్య తాతమనవడి రిలేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఓల్డ్ డాన్ రోల్ సినిమాలో కనిపించేది కాసేపే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ కానున్నాడని సమాచారం.ఎన్టీఆర్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రీకొడుకులుగా, అన్నదమ్ములుగా నటించి మెప్పించాడు. అయితే ఇలా తాతమనవడిగా నటించడం మాత్రం ఇదే మొదటిసారి. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేయగల ఎన్టీఆర్.. 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.ఇప్పటికే ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం కూడా చేసిన అనుభవం జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది. ఎలాంటి పాత్రలో అయినా తారక్ ఒదిగిపోతాడు. యాక్టింగ్ పరంగా తారక్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: