రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్
డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో
హెబ్బా పటేల్, వశిష్ట సింహ,
పూజిత పొన్నాడలు తమ నటనతో ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘ఓదెల 2’గా సీక్వెల్ రాబోతుంది.దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’
మూవీ ప్రేక్షకుల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు
అశోక్ తేజ డైరెక్ట్ చేయగా, నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో ఇప్పుడు మేకర్స్ రెండో పార్ట్ ను రూపొందిస్తున్నారు. ‘ఓదెల-2’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ
బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో నటిస్తోంది.ఈ సినిమాలో శివశక్తి అనే పవర్ఫుల్ పాత్రలో తమన్నా నటిస్తోంది.ఇక తాజాగా ఈ
సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలపై బోనం ఎత్తుకున్న తమన్నా పోస్టర్ తో బోనాల
పండుగ శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. ఈ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు చిత్ర యూనిట్.ఇక ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో వేసిన భారీ మల్లన్న స్వామి ఆలయ సెట్ లో శరవేగంగా జరుగుతోంది.మొదటి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈసారి థియేటర్లలో పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మధు క్రియేషన్స్,
సంపత్ నంది టీమ్ వర్క్స్ సంస్థలపై డి మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాంతారా, విరూపాక్ష, మంగళవారం వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన అంజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ
సినిమా ఆగస్ట్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ను ‘ఓదెల 2’ చిత్ర సెట్స్‌లో డైనమిక్
డైరెక్టర్ సంపత్ నంది,
మిల్కి బ్యూటీ తమన్నా ,
హీరో వశిష్ఠ సింహ, మధు క్రియేషన్స్ అధినేత మధు.డి,
డైరెక్టర్ అశోక్ తేజ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ల సమక్షంలో విడుదల చేశారు.