రాయన్ కి సూపర్ స్టార్ మహేష్ ఫిదా..?

Purushottham Vinay

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన రాయన్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ అనేది లభిస్తోంది. ధనుష్ 50వ సినిమాగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే ఈ రాయన్ సినిమా తెరకెక్కింది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాయన్ కథని ధనుష్ సిల్వర్ స్క్రీన్ పై చాలా అద్భుతంగా ఆవిష్కరించాడనే మాట ప్రేక్షకుల నుంచి బలంగా వినిపిస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్  100 కోట్లకి అటు ఇటుగా దగ్గరగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సోమవారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో రాయన్ మూవీ మొత్తం కలెక్షన్స్ సెంచరీకి దగ్గరగా వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. దీంతో సార్ సినిమా తర్వాత ధనుష్ కి రాయన్ తో మరో సూపర్ హిట్ పడినట్లే అని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది.రాయన్ మూవీలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ధనుష్ ఎంతగానో ఆకట్టుకున్నాడని, అలాగే అతని డైరెక్షన్ మేకింగ్ కూడా బ్రిలియంట్ గా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 


అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తో ఎస్.జె.సూర్య, సందీప్ కిషన్ ఇంకా ప్రకాష్ రాజ్ మెప్పించారని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఎక్స్ ట్రార్డినరీగా మ్యూజిక్ అందించారని సూపర్ స్టార్ మహేష్ బాబు రాయన్ కి పాజిటివ్ రివ్యూని ఇచ్చారు.నిజానికి మహేష్ బాబుకి ఏ సినిమా అయిన బాగా నచ్చితే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా మన భాష సినిమానా పరభాష సినిమానా అని చూడరు. ఆయనకి నచ్చిందంటే చాలు ఎలాంటి ఈగో లేకుండా ట్విట్టర్లో పొగడ్తల వర్షం కురిపిస్తారు. అవి కొన్ని సినిమాలకి మాత్రమే ఆయన తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాంటిది రాయన్ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడంటే సూపర్ స్టార్ కి బాగా నచ్చి ఉంటుందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మహేష్ బాబు ట్వీట్ తో ధనుష్ ఫ్యాన్స్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.కచ్చితంగా కలెక్షన్స్ పరంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ రాయన్ కి బాగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. 46 కోట్ల బ్రేక్ తక్కువ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. నాలుగు రోజుల కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించి ఉంటుందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. రాయన్ మూవీ సక్సెస్ సందీప్ కిషన్ కెరియర్ కి కూడా కొంత ఊపు తీసుకొచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: