టాలీవుడ్కి పూర్వ వైభవం.. ఎపిక్ లాంగ్ రన్తో దూసుకుపోతున్న కల్కి?

Purushottham Vinay

పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్  మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కూడా సత్తా చాటుతూనే ఉంది.జూన్ 27 వ తేదీన వరస్డ్ వైడ్‌గా విడుదలైన కల్కి మూవీ ఇప్పుడు ఏకంగా ఐదు వారాలకు చేరుకుంది. అయినప్పటికీ కూడా ఈ సినిమా జోరుగా కలెక్షన్స్ రాబడుతోంది.కల్కి 2898 ఏడీ సినిమా 33వ రోజున అంటే ఐదో సోమవారం రోజున ఇండియాలో భారీ వసూళ్లు రాబట్టింది. వీటిలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 54 లక్షలు, హిందీ బెల్ట్ నుంచి రూ. 45 లక్షలు, తమిళం నుంచి రూ. 3 లక్షలు, కర్ణాటక నుంచి రూ. లక్ష, మలయాళం నుంచి రూ. 2 లక్షలు వసూలు చేసింది. అయితే, 33వ రోజున తెలుగు వెర్షన్‌కు మాత్రం భారీగా కలెక్షన్స్ వచ్చాయి.అయితే, గత వారం రోజుల కలెక్షన్స్ చూస్తే మాత్రం 33వ రోజున ఇండియాలో కలెక్షన్స్ కొంచెం తగ్గినట్లు చెప్పుకోవాలి.  32వ రోజున నాలుగు కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ అంతకుముందు రోజున రూ. 2.9 కోట్లు వసూళ్లు రాబట్టింది.

ఏమైనా గానీ 33వ రోజున కూడా కోటి రూపాయలు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో తగ్గేదేలే అంటోంది ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ.నిజానికి ఐదు వారాల పాటు లాంగ్ రన్ అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇంత లాంగ్ రన్ ఈమధ్య కాలంలో ఏ సినిమా మెయింటైన్ చెయ్యలేదు.మొత్తం 33 రోజుల్లో ఇండియాలో కల్కి 2898 ఏడీ సినిమాకు ఏకంగా రూ. 633.పైగా కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 282.35 కోట్లు వస్తే హిందీ వెర్షన్ నుంచి మాత్రం అత్యధికంగా రూ. 285.2 కోట్ల కలెక్షన్స్ రావడం విశేషం. అలాగే కర్ణాటక నుంచి రూ. 5.71 కోట్లు, తమిళం నుంచి రూ. 35.8 కోట్లు, మలయాళ వెర్షన్‌కు రూ. 23.99 కోట్లు వసూలు అయ్యాయి. 33 రోజుల్లో ఇండియా వైడ్‌గా చూస్తే హిందీ నుంచే ఎక్కువగా నెట్ కలెక్షన్స్ అనేవి వచ్చాయి. ఇక గ్రాస్ పరంగా చూస్తే ఈ సినిమాకి 1180 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా ఉంది కాబట్టి కచ్చితంగా త్వరలో KGF, ఆర్ ఆర్ ఆర్ వసూళ్ళని దాటే అవకాశం ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: