సీఎం రేవంత్ రెడ్డి పై.. నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Divya
గతంలో సిని పరిశ్రమకి ప్రభుత్వం నుంచి నంది అవార్డులు వంటివి ఇచ్చేవారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.దీనిపైన చాలామంది సినీ సెలబ్రెటీలు సైతం ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామంటూ కూడా తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే విషయం పైన అభిప్రాయంగా కొన్ని సూచనలు ఇవ్వాలి అంటూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి అభిప్రాయాలను కోరడం జరిగిందట.

ఈ విషయం పైన ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.. నిన్నటి రోజున డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గద్దర్ అవార్డుల పైన సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పట్ల తాను కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు.. తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషికి విజయాలకు గద్దర్ అవార్డు పేరు ప్రకటించేనట్లుగా తెలియజేశారు. సీఎం వ్యాఖ్యలతో ఇప్పుడు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం పైన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. సీఎం గారి అపాయింట్మెంట్ కోసం మేము చాలానే ట్రై చేసాము. కానీ ఫోన్లు కూడా చేశాము స్పందన లేదు మిస్ కమ్యూనికేషన్ అయి ఉంటుంది.. ఒక ముఖ్యమంత్రి చెబితే ఎవరైనా చేయకుండా ఉంటారా నేను కలిసినప్పుడు కూడా ఈ అవార్డుల గురించే మాట్లాడాను దానికి కావాల్సిన విధివిధానాలను కూడా సిద్ధం చేయమని చెప్పానని తెలిపారు. గద్దర్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి సైతం ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తెలియజేశారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రి ఎవరిని కలవమన్నా కలుస్తామని తెలిపారు. కేవలం సీఎం గారి బిజీ మిస్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఇది ముందుకు సాగలేక పోయింది అంటూ తెలిపారు. సీఎం గారు ఆఫీస్ కి పిలిచి ఎవరిని కలవమన్న కలుస్తామంటూ తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: