ఎక్కువగా అలాంటి పాత్రలే ఎంచుకుంటా.. జాన్వి కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
తన తల్లి లాగానే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవాలని ఆశపడుతుంది. ఆమె ఎవరో కాదు అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. భారీ బ్యాక్ గ్రౌండ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన జాన్వి కపూర్.. అక్కడ ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంది. ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలతో కూడా తన నటనతో మెప్పించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో నటిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితమంతా నటనకే అంకితం అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తాను రిస్క్ తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక అలాంటి పాత్రల్లో తన నటన చూసి అందరూ సర్ ప్రైజ్ అవ్వాలని కోరుకుంటాను అంటూ తెలిపింది. ప్రతి సినిమాలో దర్శకుడు కోరుకుంది 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చింది జాన్వి కపూర్.