భారతీయుడి 2కి మరో గట్టి షాక్.. చివరికి నెట్ ఫ్లిక్స్ కూడా ముంచేసింది?

Purushottham Vinay

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలియకలో తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం భారతీయుడు 2. 28 ఏళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సీక్వెల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం విశేషం.ఎప్పుడో 2017 లోనే స్టార్ట్ అయిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలని దాటుకుని జూలై 12 వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యింది. మొత్తం రెండు భాగాలుగా ఈ సీక్వెల్ ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. భారతీయుడు పార్ట్ 2 సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయగా ఊహించని స్థాయిలో ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది.మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమాకి బ్యాడ్ టాక్ రావడంతో తరువాత అసలు ఎక్కడ కూడా కోలుకోలేదు.దీంతో రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


 మొత్తం 250 కోట్ల బిజినెస్ టార్గెట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాగా ఇప్పటి దాకా వరల్డ్ వైడ్ గా 146.58 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే అందుకుంది. దీంతో భారీ నష్టాలని ఈ మూవీ నిర్మాతలకి తీసుకొచ్చింది. శంకర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ మూవీ మారింది. భారతీయుడు 2 సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 120 కోట్లకి రిలీజ్ ముందే కొనుగోలు చేసింది. అయితే ఊహించని స్థాయిలో మూవీ దారుణంగా డిజాస్టర్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా ఎంగేజ్ చేసే ఛాన్స్ ఉండదని భావించి నెట్ ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది.  అందుకే ముందు మాట్లాడుకున్న స్థాయిలో 120 కోట్లు ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు రెడీగా లేదని తెలుస్తోంది.ప్రస్తుతం నిర్మాతలతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ పై చర్చలు నడుస్తున్నాయని సమాచారం తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే డిజిటల్ స్ట్రీమింగ్ కి భారతీయుడు 2 సినిమా వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.  ఏదైనా ఇలాంటి టైములో భారతీయుడు 2 కి నెట్ ఫ్లిక్స్ షాక్ ఇచ్చిందంటే ఇది కచ్చితంగా భారీ నష్టం కలిగించే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: